Spirit: స్క్రిప్ట్ పూర్తయింది.. ఇక షూటింగ్ ఒక్కటే లేటు.! 1 y ago
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. దర్శకుడు సందీప్ వంగ ఆరు నెలలు కష్టపడి మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ఇక షూటింగ్ మే నెల మొదటి వరం నుండి ప్రారంభం కానుంది. సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ లేదా రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుందని సందీప్ రెడ్డి వంగ గతంలోనే ప్రకటించారు.