Korean Actress: కొరియన్ నటి ది ఆత్మహత్య అని ధ్రువీకరించిన పోలీసులు..! 1 y ago

featured-image

ఇంట్లో శవమై కనిపించిన సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్ ది ఆత్మహత్యే నని సియోల్ పోలీసులు ధ్రువీకరించారు. సె రాన్ మరణం పై పలు అనుమానాలు వ్యక్తం కాగా పోస్టుమార్టమ్ నివేదిక, విచారణ ముగిసిన అనంతరం పోలీసులు ఈ ప్రకటన చేశారు. 2000 లో జన్మించించిన ఈమె 'ఏ బ్రాండ్ న్యూ లైఫ్' మూవీలో నటించి ఇంటర్నేషనల్ స్టార్ డమ్ ని సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకున్న నటిగా ఈమె గుర్తింపు పొందారు.

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) క‌న్న‌మూసిది. ఆదివారం సియోల్ లోని తన ఇంటిలో ఆమె శవమై కనిపించింది. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అక్క‌డి అధికారులు వెల్లడించారు. 2009లో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీసుల్లో సె రాన్‌ కీలక పాత్రల్లో క‌నిపించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD