Payyavula Keshav: గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై పయ్యావుల తీవ్ర విమర్శలు 1 y ago
AP : గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్. కూటమిపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని చెప్పారు. వైసీపీ నిర్వాకం వలన ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. క్లిష్ట పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గతంలో జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్న పని అని చెప్పారు.
వైసీపీ హయాంలో రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించామని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి రూ. 15000 కింద అందజేస్తామన్నారు. రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు.