Payyavula Keshav: ప్రతిపక్షం పై ప్రక్షోభం: పయ్యావుల వ్యాఖ్యలు..! 1 y ago
AP : వైసీపీ నేతలు బడ్జెట్ సమావేశాలకు రాకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వ నాయకులు చేసిన పాపాలు వాళ్లని వెంటాడుతున్నాయన్నారు. సభకు వస్తే వైసీపీ చేసిన లోపాలను ఎత్తి చూపుతామనే నెపంతో సమావేశాలకు రావడం లేదన్నారు. ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు.
రాజకీయాల్లో నీతిని, విలువలను వదిలేసి ప్రతిపక్షం గొంతు నొక్కడంపైనే వైసీపీ దృష్టి పెట్టిందన్నారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రజలను మోసం చేసి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు అంటూ నాటకాలు ఆడారన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని తెలిపారు.
తల్లికి వందనం పేరుతో మహిళలకు, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు బాసటగా నిలవాలని వైసీపీ నాయకుల ఊహకందకుండా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వైసీపీ ఈ రాష్ట్రానికి హానికరమన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడారన్నారు. పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేశారన్నారు.