Pawan Kalyan: "వైసీపీ నేతల ప్రవర్తనపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు" 1 y ago
AP : గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతల ప్రవర్తన సరికాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. గొడవలకు, బూతులకు వారు కేరాఫ్ అడ్రస్‌గా మారారన్నారు. చట్టాలు చేయాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎన్డీఏ సభ్యులు హూందాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు.
వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారన్నారు. తమ తప్పు లేకపోయినా వైసీపీ తీరుపై గవర్నర్ కు క్షమాపణలు చెబుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం 1800 కిలో మీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మించారని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 వేలకు పైగా గోకులాలు నిర్మించామని చెప్పారు. 6 నెలల్లోనే 4 వేల కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేశామన్నారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. అదే విధంగా అప్పటి అటవీశాఖ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. పొలంగూడ గిరిజన గ్రామానికి రోడ్డు వేయడం వల్ల డోలి మోతలు తప్పాయని తెలిపారు.