Pakistan: పాకిస్థాన్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు..? 1 y ago
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేసులో చాలా వెనకబడి పోయింది. పాక్ సెమీస్ చేరాలంటే ఫిబ్రవరి 24న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ను బంగ్లాదేశ్ ఓడించాలి. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో పాక్ కచ్చితంగా విజయం సాధించాలి. మార్చి 2న న్యూజిలాండ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలి. ఇలా జరిగితే గ్రూప్-ఎలో భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. మిగతా మూడు జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్టు టీమ్ ఇండియాతోపాటు నాకౌట్ దశకు చేరుతుంది.