Pakistan: పాక్ సెమీస్ రేసు నుంచి ఔట్..చెత్త రికార్డులివే! 1 y ago
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలై లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకు ముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాకు ఇదే పరిస్థితి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నాలుగో జట్టుగా పాకిస్థాన్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది.