Pak-Bangladesh : పాక్-బంగ్లాదేశ్ స్నేహం... వాణిజ్య సంబంధాలకు శ్రీకారం 1 y ago
తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఏర్పాటు చేసుకున్నాయి. 50 వేల టన్నుల బియ్యంతో కరాచీలోని పోర్టు కాసీం నుంచి బంగ్లాదేశ్‌కు తొలి సరకు రవాణా నౌక బయల్దేరింది. బంగ్లాదేశ్ భారత్‌తో సంబంధాలను దూరంగా ఉంచుకుంటూ, పాకిస్థాన్‌కు చేరువవుతోంది. 1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడిన తర్వాత, ఇరుదేశాల మధ్య ఈ స్థాయిలో వాణిజ్య ఒప్పందం జరగడం విశేషం.