Obama: స్టార్ గోల్ఫర్ బయోపిక్ నిర్మించనున్న మాజీ అధ్యక్షుడు ఒబామా..! 1 y ago
స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.