Vivo V50: అద్భుతమైన కెమెరాతో.. మరింత మెరుగైన అనుభవం! 1 y ago

featured-image

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో, తన కొత్త స్మార్ట్‌ఫోన్ "Vivo V50" ను మార్కెట్లో లాంచ్ చేసింది. కెమెరా ప్రియులకు ఇది నిజంగా పండగే. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్, అభూతమైన డిజైన్ వినియోగదారులను బాగా ఆకర్షిస్తుంది. గేమ్స్ ఆడేవాళ్లకి కూడా ఇది బెస్ట్ ఛాయిస్. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్ మరియు ధర ఇప్పుడు చూద్దాం...

Vivo V50: స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు: Vivo V50 తన ప్రీవియస్ మోడల్ అయినా Vivo V40 కి అప్డేటెడ్ వెర్షన్. ఇది V40 లో ఉన్న లోటుబటులను అధిగమిస్తూ మరింత మెరుగైన టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్:

ప్రాసెసర్: Snapdragon 7 Gen 3

RAM: 12GB వరకు LPDDR4X RAM

స్టోరేజ్: 512GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్

కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా

డిస్‌ప్లే: 6.78-inch Quad-curved FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

ఫోన్ యొక్క ప్రత్యేకతలు:

Vivo V50 యొక్క కెమెరా సిస్టమ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తుంది..ఇది పాత వర్షన్లతో పోలిస్తే మరింత మెరుగైన ఫోటో క్వాలిటీని అందిస్తుంది. సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరాతో మరింత స్పష్టమైన ఫోటోలు తీసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉన్న డిస్‌ప్లే వినియోగదారులకు స్మూత్ అనుభవాన్ని కలిగిస్తుంది.

ధర మరియు అమ్మకపు వివరాలు: Vivo V50 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది:

128GB స్టోరేజ్ మోడల్: రూ. 34,999

256GB స్టోరేజ్ మోడల్: రూ. 36,999

ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న మొదటి అమ్మకం షెడ్యూల్ చేయబడింది. ఈ ఫోన్ Flipkart, Vivo ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో మరియు ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

Flipkart లాంచ్ ఆఫర్లు: Vivo V50 పై కొన్ని లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి:

HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ ₹2,000 తక్షణ తగ్గింపు ఉంటుంది.

6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

చూశారుగా ఫీచర్లు అదిరిపోయాయి. కెమెరా అయితే సూపర్.. ఫోటోలు క్లారిటీగా వస్తాయి. సెల్ఫీలు కూడా అదిరిపోతాయి. డిజైన్, ఫీచర్లు అన్నీ బాగున్నాయి. గేమ్స్ కూడా సూపర్ ఆడొచ్చు. ధర కూడా ఓకే. మొత్తానికి వివో V50 ఒక సూపర్ ఫోన్. ఇంకేం చూస్తున్నారు ఆలోచించకుండా వెళ్లి కోనేయండి.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD