Narayana: రాజధాని నిర్మాణానికి మూడేళ్ల గడువు...! 1 y ago
AP : టాప్ - 5 రాజధానుల్లో అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో ప్రధాన రోడ్లు రెండేళ్లలో, ఏడాదిన్నరలో అధికారుల భవనాలు, ఎల్బీఎస్ రోడ్లు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి చేశామన్నారు. గతంలో 131 సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించామని, వైసీపీ నిర్వాకం వలన కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పర్తయ్యిందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ. 64,721 కోట్లు ఖర్చవుతుందని, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా రూ. 1500 కోట్లు ఇచ్చిందని, హడ్కో నుంచి మరో రూ.11 వేల కోట్ల రుణం వస్తుందని తెలిపారు.
భూసేకరణకు 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇచ్చామని, ఫిబ్రవరి 15లోపు భూసేకరణను పూర్తి చేశామని తెలిపారు. ఒక్క సమస్య లేకుండా 58 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తైందని, కానీ రాజధాని అమరావతిపై కక్షతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్ - 5 క్రియేట్ చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అమరావతిలో 50 వేల మందికి ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకొని వారికి వేరేచోట కేటాయిస్తామని తెలిపారు.