Nadendla: సూపర్ సిక్స్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు...! 1 y ago
AP : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించే వ్యక్తి కాదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి కౌలు రైతులను ఆదుకున్నారన్నారు. రైతుల కోసం దాదాపు రూ.5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారన్నారు. పులివెందు నియోజకవర్గంలో కూడా 24 మందికి లక్ష రూపాయలు చొప్పున అందజేశారన్నారు.
రాష్ట్రంలో జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నారు. సూపర్ సిక్స్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. దీపం పథకంపై దుష్ప్రచారం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 94 లక్షల 32 వేల మందికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేశామన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత ఒక మాట చెప్పకూడదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేశారన్నారు. రూ. 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని చెప్పారు.