Sunita Williams: రేపే భూమిపైకి సునీతా విలియమ్స్ 1 y ago
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమిపైకి చేరుకుంటారు. వీరి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి సమీపంలో సాగర జలాల్లో దిగుతుందని నాసా సోమవారం ప్రకటించింది. 9 నెలల అంతరిక్ష ప్రయాణం ముగియడంతో, వారు భూమికి సురక్షితంగా చేరుకుంటారని నాసా తెలిపింది.