బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ అభ్యంతరం 1 y ago
TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఫ్యూచర్ సిటీపై ప్రశ్న సందర్భంగా ఫోర్త్ సిటీ కాదు, ఫోర్ బ్రదర్స్ సిటీ కడుతున్నారని శంభీపూర్ రాజు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు.