తమిళనాడును అదర్శంగా తీసుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్ 1 y ago
TG: బీసీ రిజర్వేషన్ల అంశంలో తమిళనాడు రాష్ట్రాన్ని అదర్శంగా తీసుకుని మందుకెళ్లామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం శాసన మండలిలో ఆయన రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేర్వేరు బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుకు BRS, BJP, CPI, MIM పార్టీలు మద్దతును ఇచ్చాయన్నారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.