హెల్మెట్ జరిమాన పెంపుపై హోం మంత్రి వివరణ 1 y ago
AP: హెల్మెట్ జరిమానా లపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్ ధరించని వారి నుంచి రూ.వెయ్యి వసూలు చేయడం పై సభ్యుల ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే నిబంధనలు అమలు చేస్తున్నామని,హెల్మెట్ లేకపోతే రూ. వెయ్యి నిబంధన రాష్ట్రమంతటా లేదని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ చర్యలు ప్రజల ప్రాణాల రక్షణ కోసమే అని ఆమె పునరుద్ఘాటించారు.