ఫ్రీ హోల్డ్ అసైన్డ్ ల్యాండ్స్ క్రమబద్దీకరణ కావు 1 y ago
AP: పేదల ఇళ్ల స్ధలాల క్రమబద్దీ కరణపై అసెంబ్లీలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానం ఇచ్చారు. అభ్యంతరం లేని స్థలాలనే జీవో 30 ద్వారా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ జీవో 30 పరిధిలోకి రావుని పేర్కరొన్నారు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది అని వెల్లడించారు. ఇళ్ల స్ధలాల క్రమబద్ధీకరణలో పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.