Gold prices: పసిడి ధరలు.! స్వల్ప మార్పులే 1 y ago
8K News-21/02/2025 ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే ఇవాళ (శుక్రవారం) బంగారం ధరలో స్వల్ప మార్పులే కనిపించాయి. 10 గ్రాములపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. గత కొన్ని రోజులతో పోలిస్తే ఇది చాల తక్కువనే చెప్పాలి. డాలర్ విలువ మారడం, డిమాండ్-సప్లై, పెళ్లిళ్ల సీజన్ లాంటి కారణాల వల్ల ధరలు మారుతుంటాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,710 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,050 పలుకుతోంది. ఇక వెండి విషయంలో కేజీ వెండి ధర రూ.1,07,900గా ఉంది.