Gold and Silver: అస్థిరంగా బంగారం, వెండి ధరలు.. చూసి కొనండి సుమా.! 1 y ago

featured-image

8K News-22/02/2025

బంగారం.. ఇది కేవలం ఒక లోహం కాదు, ఎన్నో భావోద్వేగాలకు ప్రతీక. కొందరికి ఇది పెట్టుబడి సాధనం, మరికొందరికి సెంటిమెంట్. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అలాగే, అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే నిన్న స్టాక్ మార్కెట్ బాగా నష్టపోవడంతో అది బంగారం మీద కూడా ప్రభావం చూపింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి దాదాపు 10 గ్రాముల మీద రూ.500 తగ్గింది. ఇవాళ (శనివారం) తెలుగు రాష్ట్రలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,450 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,770 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదేరాబద్ లో కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,07,000 వద్ద.. గుంటూరులో రూ.100 తగ్గి రూ.1,07,800 వద్ద.. విజయవాడలో కేజీ వెండి ధర రూ.1,07,900 వద్ద స్థిరంగ ఉంది. మొత్తం మీద చూసుకుంటే నిన్న స్టాక్ మార్కెట్ నష్టపోవడం కారణంగా బంగారం, వెండి ధరల్లో కూడా అస్థిరత ఏర్పడింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD