శాసనసభలో ప్రైవేటు యూనివ‌ర్సిటీల బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన‌ లోకేష్‌ 1 y ago

featured-image

 AP: విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రైవేటు యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల‌ ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిష్ఠాత్మక బిట్స్ పిలానీ సంస్థకు అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని, టాటా లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఏపీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD