New Zealand: కివీస్..సెమీస్ బెర్తులను తేల్చేస్తుందా? 1 y ago
సెమీఫైనల్ పై కన్నేసిన న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో సోమవారం బంగ్లాదేశ్తో తలపడుతుంది. తొలి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాకిస్థానన్ను చిత్తు చేసిన కివీస్.. రెట్టించిన విశ్వాసంతో ఉంది. మంచి రన్దేట్ (1.200) కూడా కలిగి ఉన్న ఆ జట్టు గ్రూప్-ఎలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు, గ్రూపులో మూడో స్థానంలో ఉంది. బలంగా ఉన్న కివీస్ ను అడ్డుకోవడం బంగ్లాదేశకు సవాలే. న్యూజిలాండ్ గెలిస్తే.. ఆ జట్టుతో పాటు భారత్ కూడా ముందంజ వేస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నిష్క్రమణ ఖరారవుతుంది. కివీస్ ఓడితేనే పాక్, బంగ్లా రేసులో ఉంటాయి.