మహిళల అభ్యున్నతికి బీజేపీ కృషి: కిషన్ రెడ్డి 1 y ago
TG : అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మన జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, భారత్‌లో మహిళలను శక్తిగా కొలిచే సంస్కృతి ఉందని చెప్పారు. బీజేపీలోని మహిళా మోర్చా కార్యకర్తలు అద్భుతంగా రాణిస్తున్నారని, సమాజానికి దిశానిర్దేశం చేసిందే బేటీ బచావో.. బేటీ పడావో అని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఎక్కువగా మహిళలు రాణిస్తున్నారని, సరిహద్దు భద్రతలో కూడా మహిళా సైనికుల పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలెట్లు భారత్‌లో ఉన్నారన్నారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని ప్రధాని మోడీ రద్దు చేశారని, అనేక ఇస్లామిక్ దేశాల్లోనూ ట్రిపుల్ తలాక్ విధానం లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కోసం మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు పోరాటం చేశారని, కానీ కేసీఆర్ క్యాబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను నిర్లక్ష్యం చేస్తోందని, మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. జేజేపీలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అందుకే కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు.