Kevin Peterson: ఢిల్లీ క్యాపిటల్స్ కి కొత్త మెంటార్..ఐపీఎల్-2025 1 y ago
ఐపీఎల్-2025 ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ను మెంటార్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం డీసీ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసింది. హెడ్ కోచ్ హేమంగ్ బాదానీతో కలిసి పీటర్సన్ పనిచేయనున్నాడు. ఐపీఎల్లో పీటర్సన్ మెంటార్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ 2009, 2010, 2012, 2014, 2016 సీజన్లలో ఐపీఎల్లో ఆడాడు. 2012- 2014 మధ్య దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు.