KTR: ప్రభుత్వ విధానాలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...! 1 y ago
TG : సీఎం రేవంత్ మాట్లాడే ముందు భట్టి విక్రమార్క ఇచ్చిన నివేదిక చదవాలన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకటే విషయం చెబుతున్నారన్నారు. కాళేశ్వరం వలన రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టించామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. సీఎం అయినా తరువాత కూడా భాష మారలేదన్నారు. ప్రభుత్వం సమగ్రమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలను అంగీకరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతుందన్నారు. నీళ్ల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీనే దోపిడీకి తెరతీసిందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ నష్టం చేసిందన్నారు. కృష్ణా జలాల దోపిడీ విషయంలో ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగడతామన్నారు. మేడిగడ్డ పనులు చేయకపోవడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు నాశనమవుతున్నాయని చెప్పారు.