AAI recruitment: ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు! 1 y ago
న్యూదిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హత సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1000/. ఆన్లైన్లో దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ 18.03.2025. పూర్తి వివరాలకు https://www.aai.aero/ ఇక్కడ క్లిక్ చేయండి.