JEE Main: జేఈఈ తప్పుల సవరణకు ఈ రోజే ఆఖరి అవకాశం! 1 y ago
జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్ధులు దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 27 నుంచి 28వ తేదీ రాత్రి 11.50 వరకు అవకాశం కల్పించినట్లు జాతీయ పరీక్ష సంస్ధ (ఎన్టీఏ) ప్రకటించింది. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఎన్టీఏ అధికారులు జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.