Israel: సిరియాపై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ 1 y ago
దక్షిణ సిరియాలో ఆయుధాలు ఉన్న సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా దక్షిణ భాగంలో సైనిక బలగాల ఉనికి ఇజ్రాయెల్ పౌరులకు ముప్పు కలిగిస్తుందని IDF తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవలే సిరియాలోని సైనిక బలగాలను నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో ఇద్దరు మరణించినట్లు సమాచారం.