Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల...! 1 y ago
భారత ప్రభుత్వం సైన్యంలో అగ్నివీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత కొన్ని ట్రేడ్లకు 8వ తరగతి కాగా, మరికొన్నింటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్సీసీ, ఐటీఐ, డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలుగు, తమిళంతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, దేహ దారుఢ్య పరీక్షలు ఉంటాయి. కనీస వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10 చివరి తేదీ. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.