Team Indians: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఎవరు..! అఫ్గానూ ఓ ఛాన్స్.. 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తుల్లో మూడు ఖరారు అయిపోయాయి. గ్రూప్ A నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్ స్టేజ్లో వీరి మధ్య ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు అగ్రస్థానానికి చేరుకుంటుంది. మరోవైపు గ్రూప్ Bలో ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్ కు చేరుకుంది. నెట్ రన్రెరేట్ ప్రకారం దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తుకు చేరువగా ఉండగా.. అఫ్గానిస్థాన్ ఆ తర్వాత కాచుకుని ఉంది. ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్లో సఫారీ జట్టు ఇంగ్లండ్ తో తలపడనుంది. భారత్ ను సెమీస్ లో ఢీకొట్టేదెవరనేది ఆదివారం తేలనుంది.