Imran Khan: పాకిస్థాన్ క్రికెట్ పతనంపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శనపై మాజీ ప్రధాని, కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌పై ఓటమి జీర్ణించుకోలేనిదని, జట్టు వైఫల్యానికి పీసీబీ యాజమాన్యమే బాధ్యత వహించాలని విమర్శించారు. పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి కూడా పాక్ క్రికెట్ పతనానికి ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. దేశవాళీ క్రికెట్ విధాన మార్పులు, మేనేజ్‌మెంట్ లోపాలు జట్టును దెబ్బతీశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.