ISRO Spadex: ఇస్రో 'స్పేడెక్స్' ప్రయోగాలు మార్చి 15 నుంచి పునఃప్రారంభం 1 y ago
మార్చి 15 నుంచి 'స్పేడెక్స్' ప్రయోగాలను పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపారు ఇస్రో చీఫ్ వి. నారాయణన్. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాల డాకింగ్, రీ-డాక్ ప్రయోగాలకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్ 30న నింగిలోకి పంపిన జంట ఉపగ్రహాలు, జనవరి 16న విజయవంతంగా డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాలు ఇస్రోకి మరిన్ని సాంకేతిక అభివృద్ధులను సాధించే అవకాశం కల్పిస్తాయని అధికారులు చెప్పారు.