Nani: విజయ్ దేవరకొండ రికార్డును బీట్ చేసిన నాని 1 y ago
ఒక్క టీజర్ తో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు హీరో నాని. అతడి పుట్టినరోజు సందర్భంగా 'హిట్: ది థర్డ్ కేస్' టీజర్తో అటు ఫ్యాన్స్ను ఇటు సోషల్ మీడియాను షేక్ చేశారు. దీంతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీజర్ 24 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకొని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' టీజర్ యూట్యూబ్ 15 మిలియన్ల వ్యూస్ను 'హిట్ 3' (HIT 3) అలవోకగా బీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ రికార్డును నాని బీట్ చేశారంటూ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.