Sunita Williams: సునితా విలియమ్స్ కు అనారోగ్య సమస్యలు...! 1 y ago
సునితా విలియమ్స్ కు ఎముక సాంద్రత తీవ్రంగా తగ్గింది. సునీతా విలియమ్స్ కండరాల బలహీనత, కంటి సమస్యలు, ఇమ్యూనిటీ బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉంటే శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. వ్యోమగాములు స్పేస్లో నెలకు 1 నుంచి 2 శాతం ఎముకల సాంద్రతను కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రేడియేషన్ ఉన్న వాతావరణంలో ఉండటంతో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఉందంటున్నారు నిపుణులు.