Harish Rao: కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు...! 1 y ago
TG : కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్ లైన్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. సాగర్, శ్రీశైలం ద్వారా ఏపీకి అక్రమంగా నీటిని తరలించుకుపోతుందన్నారు. అదే విధంగా కృష్ణా నీటిని కూడా అక్రమంగా వాడుకుంటోందన్నారు. గోదావరి విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి ఉండటం వలన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ అసమర్థత వలనే తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. రేవంత్‌కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదని, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని విమర్శించారు. ఇప్పటికైనా నీటి విషయంలో ప్రభుత్వం జగ్రత్త పడాలని సూచించారు.