Mohammed Hafeez: బాబర్ అజామ్ కాదు.. విరాట్ కోహ్లి అసలైన కింగ్: పాక్ మాజీ కెప్టెన్ 1 y ago
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్లో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ (23) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఈనేపథ్యంలో బాబర్ అజామ్పై ఆ దేశ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ విమర్శలు గుప్పించాడు. పీఆర్ ఏజెన్సీలపై కూడా హఫీజ్ విమర్శలు చేశాడు. ఎవరినైనా 'కింగ్ అని పిలవాలంటే అందుకు బాబర్ అజామ్ అర్హుడు కాదని.. దానికి విరాట్ కోహ్లి అర్హుడని హఫీజ్ పేర్కొన్నాడు.