సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..! 1 y ago
TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన సీఎంని కలిశారు. ఆయనకి గుమ్మడి నర్సయ్య ఒక లేఖను అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను రేవంత్ ఆప్యాయంగా పలకరించారు. సీఎంని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ.. సుమారు రెండు వారల క్రితం గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంని కలవడానికి పలుమార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే ఆపేస్తున్నారని ఆయన తెలిపారు.