Gudivada Amarnath: ప్రైవేటీకరణ వల్ల మెడికల్ విద్యపై ప్రభావం 1 y ago
AP : రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించాలని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి తీసుకొస్తూ పోరాటం చేస్తుందన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, దీని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు రూ.3000 చొప్పున భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని వైసీపీ హయాంలో నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ. 8500 కోట్లు కూడా కేటాయించామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ప్రారంభించిందని, కానీ ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని ఆరోపించారు.