Google Pay: బిల్లులపై ఛార్జీలు విధించిన గూగుల్ పే..! 1 y ago
గూగుల్ పే తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కార్డులతో బిల్లులు చెల్లించేవారికి ఛార్జీలు విధిస్తోంది. విద్యుత్, గ్యాస్, ఫోన్ రీఛార్జ్ వంటి బిల్లులపై 1% ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ వ్యక్తుల మధ్య జరిగే చెల్లింపులు ఉచితంగా ఉంటాయని తెలిపింది. పేటీఎం, ఫోన్ పే వంటి ఇతర యాప్ లలో కూడా చార్జీలు అమలులో ఉన్నాయి. త్వరలో గూగుల్ పే యూపీఐ ఖాతాలను కుటుంబ సభ్యులతో లింక్ చేసే కొత్త ఫీచర్ కూడా తీసుకురానుంది.