Gold: పసిడి ధరలు ఆకాశాన్ని తాకేనా... ? 1 y ago
8K News-25/02/2025 గత కొన్ని రోజులుగా చూస్తుంటే బంగారం ధరలలో హెచ్చుతగ్గులు బాగా ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాలు, డాలర్ విలువ పెరగడం కారణంగా బంగారం విలువ కూడా బాగా పెరుగుతుంది. ఇవాళ (మంగళవారం) కూడా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,090 వద్ద పలుకుతుంది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద ₹200 మరియు ₹220 పెరిగాయి. ఇక వెండి విషయానికి వస్తే ₹100 తగ్గి కేజీ వెండి ధర రూ.1,07,900 వద్ద ఉంది.