Gold Rates: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు.! 1 y ago
8K News-13/03/2025 ఊహించని రీతిలో బంగారం ధరల్లో మార్పులు చోట చేసుకుంటున్నాయి. గత వారంలో ధరలు తగ్గగా.. ఈ వారం ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న 10 గ్రాములపై ₹450 పెరగగా... ఇవాళ (గురువారం) ఏకంగా 10 గ్రాముల బంగారంపై ₹550 పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్ ప్రభావం బంగారం ధరలపై బాగా చూపుతుంది. ఇలాగే కొనసాగితే 10 గ్రాముల మేలిమి బంగారం రూ.లక్ష దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,200 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,580 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.1,09,000 పలుకుతుంది.