Gold Prices: రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్..! 1 y ago
8K News-24/02/2025 బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఒక అంచనా లేకుండా పోయింది. గత వారం వరుసగా ఐదు రోజులు పెరిగిన బంగారం ధరలు, శుక్రవారం కొద్దిగా తగ్గాయి. కానీ శనివారం మళ్లీ పెరిగి ధరలు అస్థిరంగా మారాయి. నేడు సోమవారం 10 గ్రాములపై రూ.100 పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,870 పలుకుతుంది. ఇక కేజీ వెండి ధర మాత్రం రూ.1,08,000 వద్ద స్థిరంగా ఉంది.