Global Award: RBIకి గ్లోబల్ అవార్డు.. పీఎం మోదీ ప్రశంసలు..! 1 y ago

featured-image

భారత కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందకు ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. డిజిటల్ కార్యక్రమాలు చేపట్టినందుకు RBI ను ‘డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అవార్డు 2025’కు ఎంపిక చేశారు. యూకే సెంట్రల్ బ్యాంకు దీనిని ప్రదానం చేయనుంది. ప్రవాహ్, సారథి అనే రెండు డిజిటల్ కార్యక్రమాలను RBI చేపట్టింది. అయితే, వీటిని సంస్థ డెవలపర్ టీమ్ అభివృద్ధి చేసింది. సారథిని 2023 జనవరిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్థిక సేవలను మరింత సులభతరం చేసేందుకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. దింతో కంపెనీలు రికార్డులను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.

సారథి వల్ల కాగితం వాడకం చాలావరకు తగ్గిందని అవార్డుల కమిటీ అభినందించింది. యూజర్లు RBI కి సులభంగా రెగ్యులేటరీ అప్లికేషన్ లను అందజేయడానికి ప్రవాహు గత ఏడాది మేలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్ లోని అన్ని డాక్యుమెంట్ లను RBI ఆఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ప్రవాహ్ ద్వారా ఇప్పటి వరకు 70 రెగ్యులేటరీ అప్లికేషన్ లను డిజిటైజ్ చేశారు. భారతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డిజిటల్ ఇన్నోవేషన్ కీలక పాత్ర పోషించినట్లు సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ తెలిపింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆర్‌బీఐకి గ్లోబల్ అవార్డ్ అందించనున్నట్లు ప్రకటించింది. యూకేలోని సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ ట్రాన్స్‌ ఫర్మేషన్ అవార్డు 2025కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా ఎక్స్‌ లో తెలిపింది. ఈ విషయంపై స్పందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ లో ట్వీట్ చేశారు. RBI ను డిజిటల్ ట్రాన్స్‌ ఫర్మేషన్ అవార్డు 2025 గెలుచుకున్నందుకు మోదీ ఆదివారం ప్రశంసించారు. '2025 ఏడాదికి గానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పురస్కారానికి ఎంపిక కావడం అనేది ప్రశంసనీయ విజయం అని హర్షం వ్యక్తం చేశారు. పాలనలో సామర్థ్యం, ఆవిష్కరణలకు దక్కిన గౌరవం.. డిజిటల్ ఇన్నోవేషన్ అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే ఉంటుందన్నారు. అది ఎంతో మంది ప్రజలకు సాధికారత కల్పిస్తోంది' అని అభినందించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD