Subhman Gill: ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్ నంబర్ 1 1 y ago
ఇంగ్లాండ్ సిరీస్‌లో అదరగొట్టిన భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న బాబర్ అజామ్ ను దాటి గిల్ టాప్లోకి దూసుకెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది సేపటి ముందు ఐసీసీ వన్డే ఫార్మాట్ లో తాజా ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 796 రేటింగ్ పాయింట్లతో గిల్ మొదటి స్థానానికి చేరుకోగా.. 773 పాయింట్లతో బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ 761 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.