ఏపీలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాట్లు... 1 y ago
AP: ఏపీలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. అటవీశాఖ ఉద్యోగులకు అటవీ, వన్యప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనుకూల వాతావరణం ఉండేందుకు అటవీ సమీపంలో ఉన్న దివాన్ చెరువు ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అకాడమీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.