Sunil Chetri: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సునీల్ చెత్రి 1 y ago
దిల్లీ: భారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ చెత్రి మళ్లీ మైదానంలో మెరవనున్నాడు. తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. 40 ఏళ్ల చెత్రి నిరుడు జూన్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో 12 గోల్స్ తో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఏఐఎఫ్ ఎఫ్ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మార్చిలో ఫిపా మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.