నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏంటీ? కంగనా 1 y ago
ఎమర్జెన్సీ మూవీపై దర్శక, నిర్మాత సంజయ్ గుప్తా ఇచ్చిన రివ్యూపై నటి కంగనా రనౌత్ స్పందించారు. తన అంచనాలను తప్పని నిరూపించారని ఆయన పేర్కొనడంపై ఆమె మండిపడ్డారు. తనపై ముందుగానే ఒక అంచనాకొచ్చినట్లు ఆయన తన పోస్టులో అంగీకరించారన్నారు. తనను అర్థం చేసుకోవడం సంజయ్ పరాజయం అయినప్పుడు మళ్లీ తనపై ఒక అభిప్రాయానికి రావాలనుకోవడం ఎందుకని ప్రశ్నించారు. తనను జడ్జి చేయడానికి సంజయ్ గుప్తా ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు.