Gold smuggling case: రన్యారావు కేసులో కింగ్ పిన్ తెలుగు నటుడే 1 y ago
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు వెనుక కింగ్ పిన్ గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిని విచారించినట్లు సమాచారం. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన రన్యారావు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఈ స్మగ్లింగ్‌లో ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఐఏఎస్ గౌరవ్ గుప్తా నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది.