Shishtachar Squad: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల రక్షణకు శిష్టాచార్ స్క్వాడ్... 1 y ago
దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో మరింత రక్షణ కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శిష్టాచార్ స్క్వాడ్ పేరుతో ఒక యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయనుంది. ఇది ఢిల్లీలోని ప్రతీ జిల్లాలో రెండు శిష్టాచార్ స్క్వాడ్లు విధులు నిర్వహిస్తుంటాయి. దీనిలో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 8 మంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. వీరిలోనలుగురు మహిళా సిబ్బందితో పాటు సాకేంతిక నిపుణత కలిగిన ఒకరు ఉంటారు. ఈ స్క్వాడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో కూడా ప్రయాణిస్తుంటారు.
2017లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరిగిన వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్ నుంచి ప్రేరణ పొంది ఢిల్లీ ప్రభుత్వం ఈ శిష్టాచార్ స్క్వాడ్ నిమొదలుపెట్టనునది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ కల్పించేందుకు, స్కూళ్లు, కాలేజీల బయట జరిగే ర్యాగింగ్ లను అరికట్టేందుకు షీ టీం లు ప్రతేకంగా పనిచేస్తున్నాయి.