Delhi Capitals: ముచ్చటగా మూడోసారి ఫైనల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్.. టైటిల్ కలను ఈసారైనా నిజం చేసుకుంటారా? 1 y ago
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సత్తా చాటింది. మూడోసారి ఫైనల్స్‌కు చేరుకుని.. టైటిల్ కోసం మరోసారి పోరాటానికి సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు టైటిల్ కల మాత్రం నెరవేరలేదు. ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగ్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు WPL 2025 గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరింది.
అయితే నాకౌట్ మ్యాచ్‌లలో ఢిల్లీ ఎప్పుడు తడబడుతునే ఉంటుంది.. 2023లో జరిగిన తొలి WPL సీజన్ ఫైనల్‌లో తడబడి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కూడా ఓటమి పాలైంది. దీంతో ఫైనల్స్‌లో ఓడిపోవడం ఢిల్లీకి అలవాటు అనే భావన అందరిలో ఏర్పడింది.
అన్ని మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ తమదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. అంతేకాకుండా బౌలింగ్ తో ప్రత్యర్థులను కష్టాలు పెట్టింది. అయితే ఇంత అద్భుతమైన ప్రదర్శన ఢిల్లీ.. టైటిల్ విజేతగా నిలుస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరొక విషయం ఏంటంటే ఫైనల్‌లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఢిల్లీ జట్టు ఫైనల్‌లో తలపడుతుంది.
ముంబై ఇండియన్స్ (MI).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓడిపోవడంతో.. ఫైనల్‌కు చేరే అర్హతను కోల్పోయింది. గత సీజన్‌లో విజేతగా నిలిచిన RCB 2024 WPL.. ఈ సీజన్‌లో ముంబైపై విజయం సాధించినా క్వాలిఫైయర్స్‌లోకి అడుగు పెట్టలేకపోయింది. దీంతో గ్రూప్ స్టేజ్‌లో 4వ స్థానానికి చేరింది. ఇక గుజరాత్ జెయింట్స్ గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోకపోయిన.. ఈసారి ఆశ్చర్యకరమైన విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ముంబై జట్టు.. RCB పై ఓడిపోయిన కూడా రేపు గుజరాత్ జట్టుతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బలమైన ప్రదర్శన చూపవచ్చు. మరి వీళ్ళని గుజరాత్ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. రెండు జట్లు (MI & GG) ఢిల్లీ క్యాపిటల్స్‌ను సవాలు చేయడానికి పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో విజేత ఎవరైనాసరే మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే WPL చరిత్రలో తమ పేరు ప్రతిష్టించాలంటే.. వారు ఫైనల్ దశలో వచ్చే ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించక తప్పదు. అభిమానులు కూడా ఫైనల్ పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా ఢిల్లీ క్యాపిటల్స్ WPL ట్రోఫీని గెలుచుకుంటుందా ? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కాస్త ఓపిక పట్టక తప్పదు.