William Alsop: ఫెడరల్ ఉద్యోగాల తొలగింపుకు అడ్డుకట్ట 1 y ago
అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జ్ విలియం అల్సప్ నిలిపివేశారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగంలో భారీగా ఉద్యోగ కోతలు విధించగా, ట్రంప్ దీనికి మద్దతుగా ఫెడరల్ ఉద్యోగుల తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫెడరల్ సంస్థలకు నియామక, తొలగింపు అధికారాలు లేవని కోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వ వ్యయాల కత్తిరింపు ప్రణాళికకు ఎదురుదెబ్బ తగిలింది.